Monday, 7 October 2019

శ్రీమాత


శ్రీమాతా 🙏🙏

ఎర్రని నీ కాంతులు నా పాపాలను కడిగేస్తుంటే
పచ్చని నీ వన్నెలు రక్షలై నన్ను చుట్టెయ్యాలి

నల్లని నీ కురులు నా అఙ్ఞానపు చీకట్లని తుడిచేస్తుంటే
తెల్లని నీ నవ్వులు దీవెనలై నన్ను తడిపెయ్యాలి

వెచ్చని నీ ఒడి నన్ను లాలిస్తుంటే
చల్లని నీ చూపులు నాపై కరుణను కురిపించాలి

మెత్తని నీ కరములు నన్ను దీవిస్తుంటే
అందెల నీ చరణకమలాలను భ్రమరమై నేను ఆస్వాదించాలి 🙏🙏

-తేజ

No comments:

Post a Comment

పసిమనసు

జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు మనకు ఎంతో నేర్పిస్తాయి. మన జీవితంలో చెరగని ముద్ర వేస్తాయి.  ఈ మధ్యకాలంలో నా జీవితంలో జరిగిన ఒక మరువ...