మది శ్వేత పత్రం పై అక్షర కుసుమాల అల్లికలు, ఈ పదాల మాలికలు, నా ఈ కవితా డోలికలు. - తేజోమయి పాకనాటి
Tuesday 18 February 2020
Thursday 13 February 2020
ఆనందబాష్పాలు
నీకై వేచి చూసిన నా కనుల తాపం ఆవిరయ్యేలా
జాలువారుతున్న నా ఆనందబాష్పాలను
ఓ దోసిలి పట్టి పదిలంగా దాచేశా
ఓ ప్రేమ వానను నీపై కురిపిచమంటూ, దాచిపెట్టిన ఓ బాష్పాన్ని తీసి వేయి అడుగుల ఎత్తున ఉన్న నీలి మబ్బు అందుకునేలా అలా పైకెగరేసా
ఓ ప్రేమ ముత్యాన్ని నీకు బహుమతిగా ఇమ్మంటూ, మరో బాష్పాన్ని తీసి సంద్రంలో ఆటలాడుతున్న ఆల్చిప్పకు అరువిచ్ఛా
ఓ ప్రేమ సందేశాన్ని నీకు అందించమంటూ, ఇంకో బాష్పాన్ని తీసి మేఘ బిందువు కోసం ఎదురుచూస్తున్న చాతక పక్షికి అందించా
మరి మిగిలిన మరికొన్ని బాష్పాలను భద్రంగా ఎప్పటికీ చెక్కుచెదరని నా చిత్తపు చలువ పేటికలోనే చక్కగా దాచేశా
-తేజ
Saturday 1 February 2020
స్నేహసుమం
బహు చిత్రమె ఈ జీవితం
ఆకాశంలో అరుంధతికై వెతికా దొరకలేదు
ఆల్చిప్పలో ముత్యంకై వెతికా దొరకలేదు
అరచేతిలో వైకుంఠంకై వెతికా దొరకలేదు
మట్టిలో మాణిక్యంకై వెతికా దొరకలేదు
నవ్వుల్లో ముత్యాలకై వెతికా దొరకలేదు
మాటల్లో మంత్రాలకై, మరి గాలుల్లో గంధాలకై
వెతికా, అవీ దొరకలేదు
కానీ...
కలనైనా తలవకనే జరిగిందొక అద్భుతం
ఇలనైనా వెతకకనే దొరికిందొక అమూల్యం
అది అందమైన, అపురూపమైన నీ స్నేహసుమం
-తేజ
Subscribe to:
Posts (Atom)
నీ తలపు
తలిచే నా తలపుకి ఓ పరుగే ఉంటే మరుక్షణం అది నీ చెంతే ఉండెనులే నా ఎద సవ్వడికో పలుకే ఉంటే అది నీ పేరే వినిపించెనులే కదిలే నా కన్నులకి ఓ భాషే...
-
ఓ మనసా! మాంత్రికుడి ప్రాణం ఏ గుట్టమీద పుట్టలో ఉందో లేకపోతే ఏ చెట్టుమీద పిట్టలో ఉందో తెలుసుకోవచ్చునేమో కానీ మాయలు నేర్చిన నీవు ఏ మూల దాగున్నా...
-
నిండు వెన్నెల్లో వర్షం ..రారమ్మంటూ నన్నే పిలుస్తోంది మొన్న పున్నమి నాడే, కిటికీ లోంచి బయటకు చూస్తుంటే... వర్షంలో వెన్నెల కురుస్తోందో,...
-
మా అమ్మ సులోచని, తన చల్లని చూపే ఈ లోకాల మనుగడత్వం మ అమ్మ సౌదామిని, తన మెరుపుకిరణాలే ఈ లోకంలోని వెలుగుతత్వం మా అమ్మ సుహాసిని, తన ధ...