Tuesday 24 December 2019

ఆశలనావ


కదిలే కాలపు నదిలో
కదలని ఓ ఆశల నావలా... ఉండిపోకు అలా

జారే కన్నీటి జలపాతంతో
జారని ఓ వ్యధలా... ఆగిపోకు అలా

కరిగే వయసు తుషారంతో
కరగని ఓ కష్టంలా...ఉండిపోకు అలా

కురిసే అవరోధాల వర్షంలో
కదలలేని మానులా...నిలిచిపోకు అలా

ఉరికే జీవన సంద్రంలో
పడినా ఎగిసే కెరటంలా...
తీరాన్ని తాకి విజయాన్ని సాధించు ఆరాటంతో
కరడు గట్టిన రాతి హృదయాల్ని సైతం
నునుపు తేల్చే నీ ఈ జీవన పోరాటంలో

-తేజ

నీ తలపు

  తలిచే నా తలపుకి ఓ పరుగే ఉంటే మరుక్షణం అది  నీ చెంతే ఉండెనులే నా ఎద సవ్వడికో పలుకే ఉంటే అది  నీ పేరే వినిపించెనులే కదిలే నా కన్నులకి ఓ భాషే...