Saturday 9 November 2019

నీ తలపులు


నల్లమబ్బుల వెనక దాగిన నీరు చినుకై కురిసే వేళ
మేలిముసుగు వెనక దాగిన నీ మోము తెలిసే

కొమ్మల మాటున దాగిన పువ్వులు విరిసే వేళ
నీ చూపుల వెనక దాగిన రహస్యాలు తెలిసె

పువ్వులలో దాగిన సుగంధాలు పరిమళించే వేళ
మదిలో దాగిన నీ తలపులు నిద్దురని తొలగించె

సుమగంధపు గాలుల స్పర్శనంతో మేను పులకరించే వేళ
నీ అందాల నవ్వుల దర్శనంతో మది పులకించె

మనసున దాగిన ఊసులు మౌనంగా మురిపించే వేళ
మౌనం వెనక దాగిన మది మాత్రం పదేపదే
నిన్నే ధ్యానించె

-తేజ

No comments:

Post a Comment

నీ తలపు

  తలిచే నా తలపుకి ఓ పరుగే ఉంటే మరుక్షణం అది  నీ చెంతే ఉండెనులే నా ఎద సవ్వడికో పలుకే ఉంటే అది  నీ పేరే వినిపించెనులే కదిలే నా కన్నులకి ఓ భాషే...