Monday 25 November 2019

ఊహా పయనం


ఎటుగా సాగుతోంది నా ఊహల పయనం అని ఆలోచిస్తే, ఆరాతీస్తే...

చూశా...నీ తలపులే ఇంధనంగా
ఆగని అక్షర శకటమై సాగుతున్న
నా ఆలోచనల కలాన్ని

చూశా...నీ తలపులే పువ్వులుగా
సువాసనల మాలికనే అల్లుతున్న
నా హృదయ దారాన్ని

చూశా...నీ తలపులే పల్లవిగా
మధురమైన గీతికనే ఆలపిస్తున్న
నా మది మౌనగళాన్ని

చూశా...నీ తలపులనే నదిలో
తెరచాప చుట్టుకొని పయనిస్తున్న
నా ఊహల నావని

చూస్తూనే ఉన్నా..
పుస్తకమై చదువమంటున్న నీ కన్నులని
పువ్వులతో పోటీపడుతున్న నీ చిరునవ్వులని

-తేజ

2 comments:

నీ తలపు

  తలిచే నా తలపుకి ఓ పరుగే ఉంటే మరుక్షణం అది  నీ చెంతే ఉండెనులే నా ఎద సవ్వడికో పలుకే ఉంటే అది  నీ పేరే వినిపించెనులే కదిలే నా కన్నులకి ఓ భాషే...